బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (09:32 IST)

వారితో ప్రాక్టికల్స్ చేస్తేనే.. ప్రాక్టికల్ మార్కులు వేస్తారట.. గవర్నర్‌కు విద్యార్థిని లేఖ

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న కొందరు విద్యార్థులు ఆ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై వారు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న కొందరు విద్యార్థులు ఆ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై వారు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఇందులో తాము ఎదుర్కొన్న.. ఎందుర్కొంటున్న వేధింపులను పూసగుచ్చినట్టు వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల తీరుపై ఓ పీజీ విద్యార్థిని గవర్నర్‌ నరసింహన్‌కు చేసిన ఫిర్యాదు అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గవర్నర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు.
 
గవర్నర్‌కు ఓ విద్యార్థిని రాసిన లేఖలో... "నేను వివాహితను. నా పట్ల మా పీడియాట్రిక్స్‌ విభాగం అధిపతి రవికుమార్‌, కిరీటి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శశికుమార్‌ అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి వేధింపులు తాళలేక, అలాగని ఎదిగించలేక నగిలిపోతున్నారు. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. తమకు లొంగిపోవాలని, లేదంటే ప్రాక్టికల్‌ మార్కులు వేయమని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా వస్త్రాలంకరణ, శరీర సౌష్టవం గురించి కొందరు వైద్యులు కామెంట్లు చేస్తున్నారు. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు" అంటూ ఆ లేఖలో పేర్కొంది. 
 
మెయిల్‌ ద్వారా అందించిన లేఖలోని అంశాలపై తక్షణం విచారణ చేపట్టాల్సిందిగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీతో పాటు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు గవర్నర్‌ ఆదేశాలు జారీచేశారు. దీనిపై ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్వీ రమణయ్య అప్రమత్తమయ్యారు. ఆయన నేతృత్వంలోని ఈ కమిటీ ఆరోపణలను ఎదుర్కొంటున్న వైద్యులతోపాటు ఇతర ఫ్యాకల్టీ సిబ్బంది, వైద్య విద్యార్థులను ప్రశ్నించింది.