మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 1 ఫిబ్రవరి 2018 (17:56 IST)

నేను సెట్లో వుంటే హీరోయిన్ వైపు కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా వణుకే: షారుక్

లైంగిక వేధింపులపై ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు. తాము ఫలానా హీరో లేదా దర్శకుడు లేదా నిర్మాత చేతిలో నలిగిపోయామనీ, కొందరు కాంప్రమైజ్ కావాలంటూ వేధించారని చెప్పుకున్నారు. ఈమధ్య టాప్ హాలీవుడ్ ప్రొడ్యూసర్ లైంగిక వేధింపులపై పలువురు నటీమణులు

లైంగిక వేధింపులపై ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు. తాము ఫలానా హీరో లేదా దర్శకుడు లేదా నిర్మాత చేతిలో నలిగిపోయామనీ, కొందరు కాంప్రమైజ్ కావాలంటూ వేధించారని చెప్పుకున్నారు. ఈమధ్య టాప్ హాలీవుడ్ ప్రొడ్యూసర్ లైంగిక వేధింపులపై పలువురు నటీమణులు బహిరంగంగా చెప్పారు. ఇలాంటి వేధింపులు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వున్నాయంటూ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పట్నుంచో మొత్తుకుంటూనే వున్నది. 
 
ఇక చిన్నాచితక హీరోయన్లయితే తాము ఫలానా నిర్మాత, దర్శకుడు చేతిలో మోసపోయామంటూ ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ స్పందించారు. తన చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో, తను సెట్లో వుంటే ఏ ఒక్కరు తనతో నటించే సహచర నటీమణుల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసం చేయరని అన్నారు. ఎవరైనా కళ్లతో వక్రంగా చూసినట్లు గమనిస్తే సదరు వ్యక్తికి తను క్లాస్ పీకుతానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద షారుక్ ఖాన్ చిత్రంలో నటించే హీరోయిన్లు సేఫ్ జోన్లో వుంటారన్నమాట.