శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (12:57 IST)

తల్లిదండ్రులు, కుటుంబం.. కర్మ ఫలమే.. సర్పశాపం పూర్వీకులదే..

కర్మ ఫలంతోనే అన్నీ జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తల్లిదండ్రులు పాపం చేయడంతోనే కష్టాలు అనుభవిస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి తల్లిదండ్రుల వల్ల పాపాలు అనుభవించరు. ప్రతీ జీవుడ

కర్మ ఫలంతోనే అన్నీ జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తల్లిదండ్రులు పాపం చేయడంతోనే కష్టాలు అనుభవిస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి తల్లిదండ్రుల వల్ల పాపాలు అనుభవించరు.

ప్రతీ జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అంతేకాదు.. వ్యాధులు కూడా కర్మ ఫలం వల్లే కలుగుతాయి. 
 
అయితే ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే.. స్త్రీ శాపానికి గురైతే మాత్రం రాబోయే తరాలకు అది సంక్రమిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సర్పాలను చంపినప్పుడు.. సర్పదోషం, సర్పశాపం ఏర్పడుతుంది. అలాగే పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వకుండా వదిలిపెడితే పితృశాపం సంక్రమిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
 
పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వకుండా వుండటం, సర్పాలను చంపడం, స్త్రీలకు అన్యాయం చేయడం వంటివి చేస్తే.. అవి భావితరాలపై ప్రభావం చూపుతాయి. ఎలాగంటే.. జీవితంలో పురోభివృద్ధి కానరాదు. ఉద్యోగాలుండవు. సంతాన లోపం, వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ పూర్వీకులు చేసిన పాప ఫలితమేనని జ్యోతిష్య నిపుణులు సెలవిస్తున్నారు.