1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Deepika Padukone's Reported Gift From Ranveer Singh's Parents - Diamonds

అనుష్కకు పెళ్లైపోయింది.. ఇక దీపిక రెడీ.. నిశ్చితార్థం జరిగిపోయిందా?

బాలీవుడ్ అందాల రాశి అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ముగిసిన నేపథ్యంలో.. మరో బాలీవుడ్ సుందరి దీపికా పదుకునే పెళ్లికూతురు కాబోతోందని బిటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జనవరి ఐ

Deepika Padukone
బాలీవుడ్ అందాల రాశి అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ముగిసిన నేపథ్యంలో.. మరో బాలీవుడ్ సుందరి దీపికా పదుకునే పెళ్లికూతురు కాబోతోందని బిటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జనవరి ఐదో తేదన దీపికా పుట్టిన రోజు.

ఈ సందర్భంగా ప్రియుడు ర‌ణ్‌వీర్ సింగ్ త‌ల్లిదండ్రులు అంజు భ‌వ్నాణీ, జ‌గ్జీత్ సింగ్ భ‌వ్నాణీలు ఆమెకు ఖ‌రీదైన వ‌జ్రాల హారం, స‌బ్య‌సాచి డిజైన్ చేసిన చీర‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీపికా పదుకునే 32వ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. 
 
ఈ పుట్టినరోజు వేడుకలనే నిశ్చితార్థంగా భ్రమపడ్డారని సన్నిహితులు అంటున్నారు. అయితే విరుష్క తరహాలోనే సింపుల్‌గా వివాహం చేసుకోవాలని రణ్‌వీర్ సింగ్- దీపికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మావతి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఇక పెళ్లి చేసేసుకోవాలని దీపిక-రణ్ వీర్ నిర్ణయించినట్లు బిటౌన్ వర్గాల సమాచారం.
About Writer
selvi
తర్వాతి కథనం
''అజ్ఞాతవాసి'' బాహుబలిని బ్రేక్ చేస్తాడా?: కోటేశ్వర రావు పాటకు చిక్కులు