బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (17:53 IST)

అమెరికాలో ఏడాదికి 3,500మంది చిన్నారులు మృతి... ఎందుకు?

అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని త

అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. పిల్లలకు నిద్ర అనేది చాలా అవసరమని, తగినంత నిద్ర పిల్లలకు వుంటే రోగాలు ఆమడదూరంలో నిలిచిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. తద్వారా జలుబు, జ్వరం దూరమవుతాయి. పిల్లలను ఎప్పుడూ ఆడుకోనివ్వకుండా మధ్యాహ్నం పూట రెండు గంటలపాటు హాయిగా నిద్రపుచ్చాలి. 
 
ఇలా చేస్తే జలుబు సులభంగా నయం అవుతుంది. శీతాకాలంలో వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వల్ల జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. వేడి నీటితో స్నానం చేయించడం.. గోరు వెచ్చని నీటిని శీతాకాలంలో తాగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.