బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (09:39 IST)

చైనాలో ఘోర ప్రమాదం: నౌకలు ఢీ... 32మంది గల్లంతు.. జలాలు కలుషితం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవా

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. షాంఘైకి 160 నాటికల్  మైళ్ల దూరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చమురు రవాణా నౌకకు మంటలు అంటుకోవడంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం చేకూరింది. ఆయిల్ ట్యాంకర్- సరుకు రవాణా నౌక ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. గల్లంతైన వారిలో 30 మంది ఇరాన్ దేశస్తులు, ఇద్దరు బంగ్లాదేశీయులు వున్నారు.
 
ఈ ప్రమాదం ద్వారా చమురు ఒలికిపోవడంతో చైనా సముద్ర జలాలు కలుషితం అయినట్లు చైనా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.