సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:01 IST)

డేరాలో విచ్చలవిడిగా వ్యభిచారం.. ఎంతోమందికి గర్భస్రావాలు.. సిట్ అధికారులు

అత్యాచారం కేసుల్లో అరెస్టయి.. జైలులో చిప్పకూడు తింటున్న గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టాను సిట్ అధికారులు విప్పుతున్నారు. హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన గుర్మీత్ సింగ్ బాబా డేరాలో విలాసవంతమైన జీవితాన్న

అత్యాచారం కేసుల్లో అరెస్టయి.. జైలులో చిప్పకూడు తింటున్న గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టాను సిట్ అధికారులు విప్పుతున్నారు. హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన గుర్మీత్ సింగ్ బాబా డేరాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. తాజాగా డేరాలో అమ్మాయిలను రవాణా చేసేవారని, అవయవాల వ్యాపారం కూడా జరిగేదని సిట్ అధికారులు అంటున్నారు.

దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా లభించాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందుతున్నాయని తెలిపారు. తనకు సహకరించే రాజకీయ నాయకులు, ప్రముఖుల కోసం గుర్మీత్ అమ్మాయిలను ఎంచుకుని మరీ పంపించేవాడని సమాచారం. 
 
హర్యానా, సిర్సా శివార్లలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రామ్ రహీమ్ జరిపిన దారుణాల్లో అమ్మాయిల అక్రమ రవాణా కూడా జరిగేదని అధికారులు చెప్తున్నారు. అంతేగాకుండా, విచ్చలవిడి వ్యభిచారం కూడా డేరాలో సర్వసాధారణమని అధికారులు తెలిపారు.

డేరా నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపుతూ ఉండేవారని తమకు సాక్ష్యాలు లభించాయని, వాటిపై విచారణ ప్రారంభించామని సిట్ అధికారులు వెల్లడించారు.

సురక్షితం లేకుండా విచ్చలవిడిగా వ్యభిచారం జరిగిందని.. ఈ క్రమంలో ఎంతో మందికి గర్భస్రావాలు జరిగాయని, బాధితులు బాబాపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్తున్నారు.