మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:35 IST)

హనీప్రీత్ సింగ్‌తో మాట్లాడాలి... గుర్మీత్ సింగ్, అక్కడ 600 అస్థిపంజరాలు?

అత్యాచార కేసుల్లో అరెస్టయి జైలులో చిప్పకూడు తింటున్న డేరా బాబా... తన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌తో మాట్లాడాలని ఉవ్విళ్లూరుతున్నాడట. హనీప్రీత్ సింగ్ పేరుకు మాత్రమే దత్తపుత్రికని.. ఆమెతో గుర్మీత్ సింగ్

అత్యాచార కేసుల్లో అరెస్టయి జైలులో చిప్పకూడు తింటున్న డేరా బాబా... తన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌తో మాట్లాడాలని ఉవ్విళ్లూరుతున్నాడట. హనీప్రీత్ సింగ్ పేరుకు మాత్రమే దత్తపుత్రికని.. ఆమెతో గుర్మీత్ సింగ్‌కు అక్రమ సంబంధం వున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో.. జైలులో ఒంటరిగా వున్న డేరా బాబా నానా తంటాలు పడుతున్నారు. తనకు సన్నిహితంగా వున్న హనీప్రీత్ సింగ్‌తో మాట్లాడాలని బాబా ఆమె ఫోన్ నెంబర్‌ను కూడా జైలు అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
అయితే ఇప్పటికే హనీప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో హనీ ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించేసిందని సమాచారం. డేరా బాబు హనీప్రీత్ సింగ్‌కు చెందిన రెండు నెంబర్లు ఇచ్చాడని.. ఆగస్టు 25 నుంచి ఆ నెంబర్లు పనిచేయట్లేదని జైలు అధికారులు వెల్లడించారు. డేరా బాబా ఇచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా హనీప్రీత్ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు హర్యానా డీజీపీ (జైలు) కేపీ సింగ్ తెలిపారు.  
 
ఇదిలా వుంటే.. డేరా సచ్ఛా సౌదా పేరిట ఎన్నో అకృత్యాలు నడిపి జైలులో మగ్గుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ పాపాల చిట్టా రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. డేరా ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకూ 600కు పైగా అస్థి పంజరాలు లభ్యం అయినట్టు సోదాలు నిర్వహిస్తున్న సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ డేరా పరిధిలోనే ఉన్నాయని, ప్రతి సమాధిపైనా ఓ మొక్కను నాటారని, కొన్ని మొక్కలైతే ప్రస్తుతం వృక్షాలుగా మారాయని సిట్ అధికారులు అంటున్నారు. 
 
ఈ అస్థిపంజరాలు ఎవరివి అనే కోణంలో విచారణ జరుపుతున్నామని.. డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నామని సిట్ అధికారులు చెప్పారు. కాగా, డేరాకు వచ్చే గుర్మీత్ భక్తులు తాము మరణిస్తే, మోక్షం కోసం ఈ ప్రాంతంలోనే ఖననం చేయాలని కోరుతుంటారని, ఆ కారణంగానే వారిని ఇక్కడే సమాధి చేశామని కొందరు డేరా ప్రతినిధులు వాదించిన సంగతి తెలిసిందే. తనకు ఎదురు తిరిగిన వారిని హత్య చేసి ఇక్కడే పూడ్చి పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్మీత్‌పై పలు ఆరోపణలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేరాలో సోదాలను ఇప్పటికి ఆపే ప్రసక్తే లేదని సిట్ అధికారులు తెలిపారు.