మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (21:08 IST)

చిఛీ... చెత్త బ్యాటింగ్, 135 పరుగులకే ఆలౌట్, కోహ్లి సేన చిత్తుచిత్తు

ఇది మామూలే. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే బూతులు తిడతారు. ఇప్పుడదే జరుగుతోంది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా బ్యాట్సమన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీనితో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా తొలి టెస్టులో 72 పరుగుల తేడా

ఇది మామూలే. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే బూతులు తిడతారు. ఇప్పుడదే జరుగుతోంది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా బ్యాట్సమన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీనితో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 
 
టీమిండియాకు దక్షిణాఫ్రికా నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదులే అని అనుకున్నారంతా. కానీ దాన్ని ఛేదించలేక కోహ్లీ సేన చతికిలపడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత దారుణమైన బ్యాటింగుతో 135 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బ్యాట్సమన్ల నడ్డి విరిచిన బౌలర్‌గా వెర్నాన్‌ ఫిలాండర్‌ నిలిచాడు. అతడు ఏకంగా 6 వికెట్లు తీయడంతో భారత్ కోలుకోలేకపోయింది.