శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (15:33 IST)

శ్రీలంక మాజీ కెప్టెన్ జయసూర్యను చూస్తే అయ్యోపాపం అంటారు?

శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ జయసూర్య పరిస్థితి దీనంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటింగ్‌తో అదరగొట్టే సూర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్ట్ర

శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ జయసూర్య పరిస్థితి దీనంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటింగ్‌తో అదరగొట్టే సూర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్ట్రెచర్స్ లేనిదే జయసూర్య అడుగులు ముందుకు వేయని పరిస్థితికి చేరుకున్నాడు.

ఎడమచేతి వాటంతో ఆడే సూర్య క్రీజులోకి దిగితే బౌలర్లు జడుసుకుంటారు. కానీ స్ట్రెచర్స్ లేనిదే నడవలేని స్థితిలో సూర్య వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినవారంతా అయ్యోపాపం అంటున్నారు. 
 
మోకాలి సమస్య నుంచి బయటపడేందుకు సూర్య త్వరలోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మోకాలికి శస్త్రచికిత్స కోసం వెళ్లనున్నాడని సమాచారం. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం జయసూర్య శ్రీలంక క్రికెట్ బోర్డుకు రెండుసార్లు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్న జయసూర్య 1996లో శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.