బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (16:12 IST)

తండ్రిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించిన హీరో

మెగా సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరు. తన సినీ కెరీర్‌లో "ఫిదా" చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మెగా ఫ్యామిలీ హీరో తన తండ్రిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాడట.

మెగా సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరు. తన సినీ కెరీర్‌లో "ఫిదా" చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మెగా ఫ్యామిలీ హీరో తన తండ్రిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాడట. 
 
గతంలో రాంచరణ్ హీరోగా నాగబాబు 'ఆరెంజ్' అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ నష్టాన్ని మిగల్చడంతో నాగబాబు ఆర్థికంగా చితికిపోయారు. దీంతో తన ఆస్తులను కూడా అమ్ముకుని అద్దె ఇంటిలోకి మారారు. ఆసమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నాగబాబు పలుసందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. 
 
ఆసమయంలో సోదరుడు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకున్నాడనే ప్రచారం ఉంది. దీంతో నిలదొక్కుకున్న నాగబాబు టీవీ షోస్‌లతో బిజీ అయ్యారు. మరోవైపు నాగబాబు కుమార్తె నిహారిక కూడా నటిగాను, కుమారుడు వరుణ్‌ తేజ్ హీరోగా తమదైన రూట్లో ప్రయాణిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో నాగబాబు నష్టాల నుంచి బయటపడ్డారు. ఇటీవలే తండ్రికి ఒక ఖరీదైన కారును వరుణ్ తేజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. తన తల్లిదండ్రులను హైదరాబాద్‌లోని బెంజ్ షోరూమ్‌కి తీసుకెళ్లి, కోటి 30 లక్షల రూపాయల ఖరీదైన మెర్సీడెజ్ బెంచ్ జీఎల్ 350 మోడల్ కారును ఆయన కొనుగోలు చేశాడట. దీంతో నాగబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.