గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (09:16 IST)

భక్తులు కోరుకునే సమయంలో టైమ్ స్లాట్ విధానం.. టీటీడీ

భక్తులకు తిరుమల దర్శనం ఇక మరింత సులువు కానుంది. ఇప్పటికే సర్వదర్శనం భక్తులకు టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త ప్రయోగం చేయనుంది. ఇందులో భాగంగా భక్తులు కోరుకునే సమ

భక్తులకు తిరుమల దర్శనం ఇక మరింత సులువు కానుంది. ఇప్పటికే సర్వదర్శనం భక్తులకు టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త ప్రయోగం చేయనుంది. ఇందులో భాగంగా భక్తులు కోరుకునే సమయంలో దర్శనం భాగ్యం కలుగనుంది. తమకు దర్శనం ఎన్ని గంటలకు కావాలని భక్తుడు కోరుకుంటారో... ఆ సమయంలోనే టైమ్ స్లాట్ కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. 
 
ఇంకా భక్తులకు టోకెన్లు జారీ చేసేందుకు తిరుమల, తిరుపతి, రెండు కాలినడక మార్గాల్లో 109 కౌంటర్లను ఏర్పాటు చేశామని తితిదే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అలాగే రోజుకు 23వేల నుంచి 38వేల మందికి టోకెన్లు జారీ చేస్తామని.. వీరు తదుపరి 24 గంటల వ్యవధిలో తనకు నచ్చిన సమయాన్ని ముందే ఎంచుకోవచ్చునని తితిదే అధికారులు చెప్పారు. 
 
ఆ సమయానికి క్యూలైన్‌లోకి వెళితే, రెండు నుంచి మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం ముగించుకుని బయటకు రావచ్చునని తెలిపారు. తిరుమలలోని విచారణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం గెస్ట్ హౌస్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో కూడా ఈ సెంటర్లు వున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.