1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Summer tips, Sugarcane juice health benefits

వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

సహజసిద్ధంగా దొరికే తియ్యని రసం చెరకు రసం. దీనిని ఇష్టపడని వాళ్లు ఉండరు.ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 1. వేసవిలో ప్రతి రోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం

Summer tips
సహజసిద్ధంగా దొరికే తియ్యని రసం చెరకు రసం. దీనిని ఇష్టపడని వాళ్లు ఉండరు.ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. వేసవిలో ప్రతి రోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
 
2. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి.
 
3. ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువుగా ఉన్న చెరకురసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
4. చెరకులో కాల్షియం ఉండటంతో అది ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది.
 
5. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. 
 
6. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
 
7. చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఇది కాపాడుతుంది.
 
8. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది.
About Writer
chj
తర్వాతి కథనం
కంటిచూపుకు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఏం చేయాలంటే?