శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (08:30 IST)

బుధవారం (02-05-18) దినఫలాలు - ఉన్నతిని చాటుకోవడానికి...

మేషం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోనూ ఓర్పు, లౌక్యం

మేషం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోనూ ఓర్పు, లౌక్యం అవసరం. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. అందరికీ సహాయ చేసి మాటపడతారు.
 
వృషభం : హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు బంధుమిత్రులలో గుర్తింపు, రాణింపు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఏకాగ్రత వహించలేరు. క్రయ, విక్రయ రంగాలలోని వారికి అనుకూలత. ఉద్యోగస్తులకు అధికారులవల్ల ఇబ్బందులు తప్పవు.
 
మిథునం : ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా జారవిడచుకుంటారు. ఒంటెత్తుపోకడ మంచిది కాదని గమనించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఓర్పు, సంయమనం అవసరం.
 
కర్కాటకం : ఆర్థిక విషయాలపట్ల సంతప్తి చేకూరుతుంది. కంప్యూటర్, టెక్నికల్ రంగాలలోని వారికి కలసివచ్చే కాలం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ప్రగతిపథంలో నడుస్తాయి. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేసేవారు అధికం అవుతారు. వాహన చోధకులకు ఇక్కట్లు తప్పవు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది.
 
సింహం : దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీదా ఏకాగ్రత వహించలేరు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. తోటల రంగాలలోని వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి.
 
కన్య : ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. పారిశ్రామిక రంగంలోని ఒడిదుడుకులు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
 
తుల : మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందటంవల్ల ఇబ్బందులు ఉండవు. తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యా, సాంస్కృతిక, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
వృశ్చికం : మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. వస్త్ర వ్యాపారులకు శుభదాయకం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు : బంధుమిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.
 
మకరం : స్త్రీలకు ఆధ్యాత్మిక, దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. విద్యార్థులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక వ్యవహారంలో సన్నిహితుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
కుంభం : కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. విద్యార్థులకు చికాకులు అధికం. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల విషయంలో మోసపోయే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
మీనం : స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు, వృత్తుల వారికి పురోభివృద్ధి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య రంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.