శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 1 మే 2018 (11:06 IST)

మంగళవారం (01-05-2018) - ప్రేమికులకు విబేధాలు తలెత్తగలవు

మేషం: ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తి కనిపించదు. కొంతమంది మిమ్మల్ని తక్కువచేసి వ్యాఖ్యానించటంవల్ల మనస్తాపానికి గురికావలసి వస్తుంది. బంధుమిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్

మేషం: ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తి కనిపించదు. కొంతమంది మిమ్మల్ని తక్కువచేసి వ్యాఖ్యానించటంవల్ల మనస్తాపానికి గురికావలసి వస్తుంది. బంధుమిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత విడనాడితే సత్ఫలితాలు సాధిస్తారు.
 
వృషభం: విదేశీ ప్రయాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు పరస్పర అవగాహన లోపంవల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. పనివారితో చికాకులు తప్పవు.
 
మిథునం: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరిగినా, మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధు, మిత్రుల రాకపోకలు అధికం అవుతాయి.
 
కర్కాటకం: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా, కళారంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. మధ్య మధ్యలో ఔషధ సేవ తప్పదు.
 
సింహం: ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావటంతో తీరిక, విశ్రాంతి వంటివి లభిస్తాయి. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వాహనం నడుపునపుడు మెలకువ అవసరం. మిత్రుల సహకారం లభిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
కన్య: నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టండి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తవచ్చు, జాగ్రత్త వహించండి. ఇతరులకు వాహనం ఇవ్వటంవల్ల సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం.
 
తుల: దంపతుల మధ్య అనుబంధాలు బలపడతాయి. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి. ప్రేమికులకు విబేధాలు తలెత్తగలవు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆలయ సందర్శనం చేస్తారు
 
వృశ్చికం: నిరుద్యోగులు పోటీ పరీక్షలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. మధ్యవర్తిత్వం వహించటంవల్ల గుర్తింపు పొందుతారు. మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి ఉంటుంది. ధన వ్యయం అధికం.
 
ధనస్సు: స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో మానసికంగా కుదుటపడతారు. భాగస్వాముల మధ్య ఏకీభావం కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం వీడటం క్షేమదాయకం. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం : ఆర్థిక సంతృప్తి చేకూరదు. నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలవల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, మెలకువ వహించండి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. స్థిర చరాస్తుల విషయంలో తొందరపాటుతనం మంచిదికాదని గమనించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
కుంభం: స్త్రీలు ఇతరులకు ఉచిత సలహాలను ఇవ్వటంవల్ల మాటపడక తప్పదు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించినగానీ సత్ఫలితాలు పొందలేరు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. మీ ప్రత్యర్థులు వేసే పథకాలు ధీటుగా ఎదుర్కొంటారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఇది అనువైన సమయం.
 
మీనం: దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు ఆశించినంత లాభాలను ఇవ్వవు. నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికం అవుతాయి. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.