మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 8 మే 2018 (17:30 IST)

తిరుమల శ్రీవారికి రూ. 100 కోట్లు నష్టం ఎలా అంటే..?

తిరుమల శ్రీవారు నిండా మునిగిపోతున్నారు. తల నీలాల విక్రయంలో ఏం జరుగుతుందో గానీ రానురాను ఆ ఆదాయం భారీగా తగ్గిపోతోంది. యేటా 100 కోట్లకు పైగా టిటిడి నష్టపోతోందని తెలుస్తోంది. యేడేళ్ళ క్రితం 240 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 110 కోట్లకే పరిమితం అవుతోందట. ఇంత

తిరుమల శ్రీవారు నిండా మునిగిపోతున్నారు. తల నీలాల విక్రయంలో ఏం జరుగుతుందో గానీ రానురాను ఆ ఆదాయం భారీగా తగ్గిపోతోంది. యేటా 100 కోట్లకు పైగా టిటిడి నష్టపోతోందని తెలుస్తోంది. యేడేళ్ళ క్రితం 240 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 110 కోట్లకే పరిమితం అవుతోందట. ఇంత భారీ తేడా ఉన్నా టిటిడి అధికారులకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదట. వ్యాపారులు రింగ్ అవుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు. టిటిడి అధికారులకు ఇందులో భాగస్వామ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
 
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో రోజుకు సగటున 32 వేల మంది తలనీలాలు సమర్పిస్తుంటారు. ఏడాదికి 1.20 కోట్ల మంది తలనీలాలు ఇచ్చి మ్రొక్కు చెల్లించుకుంటున్నారు. యేడాదికి దాదాపు 350 టన్నుల వెంట్రుకలు పోగవుతాయి. ప్రపంచంలో ఇంత భారీగా తలనీలాలు పోగవుతున్న సంస్థ ఇంకొకటి లేదు. భక్తులు ఎంతో భక్తిశ్రద్థలతో ఇస్తున్న తలనీలాలు శ్రీవారికి సిరులు కురిపిస్తున్నాయి. తిరుమల కళ్యాణకట్టలో పోగైన వెంట్రుకలను సైజుల వారీగా వర్గీకరిస్తారు. ఆపై వేలంలో విక్రయిస్తారు. 
 
2001 సంవత్సరానికి సాధారణ వేలంలో వీటిని విక్రయించేవారట. ఎల్.వి.సుబ్రమణ్యం ఈఓగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్ టిసి ద్వారా ఆన్లైన్‌లో విక్రయించడం ప్రారంభించారు. సంప్రదాయ పద్థతిలో వేలం వేసేటప్పుడు తలనీలాల ఆదాయం యేడాదికి 50 కోట్లు మించలేదు. ఆన్లైన్ చేసిన తరువాత ఏకంగా 200 కోట్లు దాటి ఒక యేడాది 248 కోట్లకు చేరుకుంది. గతంలో మూడు నెలలకు ఒకసారి వేలం వేసేవారు. వ్యాపారుల కోరిక మేరకు ప్రతినెలా మొదటి గురువారం నాడు వేలం వేసేలా 2015 సంవత్సరంలో సాంబశివరావు ఈఓగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే పద్థతి కొనసాగుతోందట. 
 
శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వస్తున్న ఆదాయం భారీగా పడిపోతోంది. ఇది ఆందోళన కలిగిస్తోందంటున్నారు హిందూ ధార్మిక వేత్తలు. ఆన్లైన్ ద్వారా విక్రయాలు ప్రారంభినప్పుడు యేడాదికి 240 కోట్లు వచ్చాయట. ఆ తరువాత క్రమంగా తగ్గిపోతూ వస్తోందట. ఆన్లైన్ పద్థతి ప్రవేశపెట్టిన 2011-12 సంవత్సరంలో 160 కోట్లు ఆదాయం వచ్చిందట. 2013-14 సంవత్సరంలో ఏకంగా 240 కోట్లు వచ్చిందట. ఆ తరువాత తగ్గుముఖం పట్టిందట.

2014-15సంవత్సరంలో 169 కోట్లకు పరిమితమైందట. 2015-16సంవత్సరంలో రూ 150 కోట్లు మాత్రమే సమకూరిందట. 2016-17 సంవత్సరంలో 150 కోట్లు ఆదాయం వస్తుందని అంచానాకు వచ్చిందట టిటిడి. అయితే ఆచరణలో 100 కోట్లకు మాత్రమే పరిమితమైందట. 2015-16 సంవత్సరంలో 200 కోట్లు వస్తుందని అంచనా వేస్తే అది వాస్తవంలో 150 కోట్లకే పరిమితం అయ్యింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని 2016-17లోనూ అంచనాలు పెంచలేదట. అయితే ఆ మేరకు కూడా హామీ లభించలేదట. 2017-18 సంవత్సరంలో 110 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందట. యేడేళ్ళ క్రితమే 248 కోట్లు రావడం ఏమిటి. ఇప్పుడు 110 కోట్లకు పడిపోవడం ఏమిటి. ఇదీ భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న.