సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (13:38 IST)

వేసవిలో జామకాయను తీసుకుంటే.. చర్మ సమస్యలు మటాష్

వేసవిలో చర్మానికి మేలు చేకూరాలంటే.. జామపండును తీసుకోవడం మరిచిపోకూడదు. జామపండు పలు రకాల వ్యాధుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఈ జామపండులో ఎక్కువగా ప్రోటీనులు, కార్బొహైడ్రేట్లు తక్కువగా వుంటాయి. అలాగే కమ

వేసవిలో చర్మానికి మేలు చేకూరాలంటే.. జామపండును తీసుకోవడం మరిచిపోకూడదు. జామపండు పలు రకాల వ్యాధుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఈ జామపండులో ఎక్కువగా ప్రోటీనులు, కార్బొహైడ్రేట్లు తక్కువగా వుంటాయి. అలాగే కమలా పండులో కంటే ఐదురెట్లు అధికంగా విటమిన్ సి వుంటుంది. ఇది వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
అలాగే ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే ''కొల్లాజన్'' ఉత్పత్తికి ఇది కీలకంగా పనిచేస్తుంది. జామకాయలో క్యాలరీలు తక్కువగా వుంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజుకు రెండు లేదా మూడు జామ కాయలను తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. 
 
నీటిలో కరిగే బీసీ విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో లభిస్తుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇంకా జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.