శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (15:21 IST)

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి పండ్లను తీసుకోవాలి?

మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి పండ్లను తీసుకోవాలో ఓసారి చూద్దాం.. మధుమేహ వ్యాధిగ్రస్థులు సీజనల్ ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. లో గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను తీసుకోవచ్చు. అధిక గ్లైసమిక్ ఇండెక్స్ వుండే పండ

మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి పండ్లను తీసుకోవాలో ఓసారి చూద్దాం.. మధుమేహ వ్యాధిగ్రస్థులు సీజనల్ ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. లో గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను తీసుకోవచ్చు. అధిక గ్లైసమిక్ ఇండెక్స్ వుండే పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిది. పండ్లను ఆహారంతో పాటు డైట్‌లో చేర్చుకోవాలి. కానీ పండ్లనే ఆహారంగా ఎంచుకోవడం మంచిది కాదు. పండ్లను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. 
 
పండ్లలో అధిక చక్కెర శాతం వుండకుండా చూసుకోవాలి. ఆపిల్ వంటి పండ్లను ఉడికించి.. లేదా జ్యూస్ రూపంలో కాకుండా అలానే తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులు పండ్లను శుభ్రం చేసి ముక్కల రూపంలో తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి. పుచ్చకాయను రోజుకు రెండు కప్పులు తీసుకోవచ్చు. 
 
ఎండు ద్రాక్షలను డయాబెటిస్ పేషెంట్లు తీసుకోవాలి. జామకాయలు, కివీ, ఆరెంజ్, ఆప్రికోట్స్, ఆపిల్స్, చెర్రీ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. మామిడి పండ్లు, అరటి పండ్లను మోతాదు మించకుండా తీసుకోవాలి. ఇవే కాకుండా దానిమ్మ, టమోటాలు, ప్లమ్స్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.