సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (09:49 IST)

జామకాయ ఓ బాలుడి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

ఓ జామకాయ ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తొడపై జామకాయ పెట్టి కోయాలనుకున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడు ఆనైమలైలోని మొయిదిన్‌ఖాన్‌ వీధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనైమలైకి చెందిన అన్

ఓ జామకాయ ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తొడపై జామకాయ పెట్టి కోయాలనుకున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడు ఆనైమలైలోని మొయిదిన్‌ఖాన్‌ వీధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనైమలైకి చెందిన అన్సాథ్ (14) అనే బాలుడు ఓ జామకాయ, చిన్న కత్తిని జేబులో పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. 
 
తొలి పీరియడ్ పూర్తి కాగానే విరామ సమయంలో తాను తెచ్చిన జామకాయను తొడమీద వుంచుకుని కత్తితో కట్ చేయాలని చూశాడు. అయితే కత్తి జామకాయకు తగలకుండా తొడకు తగలడంతో అక్కడే సృహ తప్పిపడిపోయాడు. 
 
అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెకు అనుసంధానమయ్యే ప్రధాన నరం కత్తి పడటంతో తెగిపోయిందని.. అందుకే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు.