శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (13:47 IST)

జామ ఆకుల టీ తాగితే... డెంగ్యూ పరార్..?

జామ ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాలున్నాయి. జామ ఆకులను ఉపయోగించి డెంగ్యూను కూడా దూరం చేసుకోవచ్చు. లేత జామ ఆకులు నాలుగింటిని తీసుకుని.. ఒక గ్లాసుడు నీరు చేర్చి మరిగించాలి. ఆపై దాన్ని వడగట్టి

జామ ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాలున్నాయి. జామ ఆకులను ఉపయోగించి డెంగ్యూను కూడా దూరం చేసుకోవచ్చు. లేత జామ ఆకులు నాలుగింటిని తీసుకుని.. ఒక గ్లాసుడు నీరు చేర్చి మరిగించాలి. ఆపై దాన్ని వడగట్టి తేనె కలిపి తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని రానీయకుండా నియంత్రించవచ్చు. జ్వరం ఉన్నవారు జామ ఆకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. 
 
జామ ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఇవి డెంగ్యూను దూరం చేస్తుంది. డెంగ్యూ ఫీవర్ కారణంగా ఏర్పడే వణుకు, ఒంటి నొప్పులు వుంటాయి. అలాంటి పరిస్థితుల్లో జామ ఆకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
రోజూ ఒక కప్పు జామ ఆకు టీ తాగడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ టీలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జామ ఆకుల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు అధిక రక్తపోటును తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. 
 
అంతేగాకుండా జామ ఆకు టీలో ఉండే యాంటీ-యాక్సిడెంట్లు ప్రాణాంతక క్యాన్సర్‌ను నివారించడంతో దివ్యౌషధంగా సహాయపడుతుంది. జామ ఆకు టీలో ఉండే లికోపిన్ ఓరల్, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణిగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.