సంబంధిత వార్తలు
- అనుష్క ఆ మాట చెప్పగానే గుండె పగిలినట్లయ్యింది, మెహరీన్
- అయ్యా పవన్.. మీ ముగ్గురు భార్యలూ.. నలుగురో.. ఐదుగురో పిల్లలు.... సీఎం జగన్
- పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్, వర్రీ అవుతున్న పవన్ ఫ్యాన్స్, ఏం జరిగింది?
- ఆ విషయంలో సీఎం జగన్ బాగా తొందరపడ్డారా, ఏమైంది?
- ఇలియానాను అంతసేపు చూడగలమా? అదే కేసీఆర్ నైతేనా? వర్మ వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ పైన లక్ష్మీపార్వతి కామెంట్స్, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో?
తాతయ్య ఎన్టీఆర్ ముఖకవళికలతో నటనలో ఆకట్టుకుంటూ, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర తారల్లో వున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సమయస్ఫూర్తితో మాట్లాడే జూ.ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు లైక్ చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగుతో బిజీగా వున్నారు.
ఐతే ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ నాయకుల నోళ్లలో జూ.ఎన్టీఆర్ పేరు నానుతోంది. అదికూడా తెదేపా పని అయిపోయిందనీ, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ పార్టీ పగ్గాలను వదిలేసి కుప్పం వెళ్లడం మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా వెళ్లేముందు పార్టీ పగ్గాలను జూ.ఎన్టీఆర్‌కి ఇచ్చి వెళ్లాలనీ, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగల సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే వున్నదంటూ చెపుతున్నారు.
తాజాగా ఇదే విషయమై ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... నిజమే, నారా లోకేష్ కంటే జూ.ఎన్టీఆర్ 100 రెట్లు బెటర్. ఏ విషయంలోనైనా అతడె కరెక్ట్. ఎన్టీఆర్‌కి సబ్జెక్ట్ పైన మంచి పట్టు వుందనీ, వాక్చాతుర్యం కూడా వుందని, నారా లోకేష్ కంటే జూ.ఎన్టీఆర్ ప్రతి ఒక్క విషయంలోనూ బెటరేనంటూ కితాబిచ్చారు.
అంతకుముందు వల్లభనేని వంశీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జూ.ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారేమోనని నారా లోకేష్ భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ కామెంట్లన్నిటినీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా చూస్తారో? వేచి చూడాల్సిందే?
తర్వాతి కథనం
