సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 6 నవంబరు 2019 (17:18 IST)

పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్, వర్రీ అవుతున్న పవన్ ఫ్యాన్స్, ఏం జరిగింది?

గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ తిరిగి తెరంగేట్రం చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారనీ, ఈ చిత్రాన్ని దిల్ రాజు- బోనీకపూర్ నిర్మిస్తున్నారని కూడా ధ్రువీకరించారు. ఇంకాస్త ముందుకెళ్లి ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు అని కూడా ఫిలిమ్ నగర్లో చర్చ మొదలైంది. 
 
ఈ వార్తలన్నీ పవన్ కళ్యాణ్‌కు చేరడంతో చికాకుపడ్డారట. అసలు తనను సంప్రదించకుండానే ఇలాంటి గాలి వార్తలు ఎలా వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా వస్తుంటే సదరు నిర్మాతలు ఎలా మౌనం వహిస్తున్నారంటూ మండిపడ్డారట. పైగా తన సరసన నయనతార లేదా పూజా హెగ్దె నటించనున్నట్లు వచ్చిన వార్తలను చూసి పవన్ పకపకా నవ్వి, ఏంటివన్నీ అంటూ ప్రశ్నించారట. 
 
పవన్ ప్రశ్నలకు అటు దిల్ రాజు ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలియదు కానీ, నేను నటించను అని భీష్మిస్తున్న పవన్ కళ్యాణ్ కామెంట్లను చూసి పవన్ ఫ్యాన్స్ బాగా వర్రీ అయిపోతున్నారట. మరి, ఫ్యాన్స్ కోసమయినా చిత్రాలు చేస్తారో లేదంటే మొండికేస్తారో చూడాల్సిందే.