ఏంటి..? అత్తకు కోడళ్లు గుడి కట్టారా? నమ్మాలి.. నమ్మి తీరాల్సిందే..! (video)
mother-in-law
కానీ.. రతన్ పూర్ గ్రామంలో గీతాదేవి కోడళ్లు అలాంటి గుడి కట్టారు మరి. అత్తంటే ఎంత ప్రేముండాలి చెప్పండి. అలా అని అత్త అమాయకురాలు కావచ్చు.
ఏమీ తెలీదు కావచ్చు అనుకోవడానికేం లేదు. మంచి నాలెడ్జ్ ఉన్న మహిళే. అయినా సరే.. తెలివితేటలు కోడళ్ల మీద ప్రదర్శించేది కాదంట గీతా దేవి. 11 మంది కోడళ్లని కన్న బిడ్డల్లా చూసుకుందంట. ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుందంట. కోడలంటే బిడ్డకంటే ఎక్కువ అనే అభిమానంతో ప్రేమగా చూసుకుందంట.
రతన్ పూర్ ఏరియాలో.. గీతా దేవి అంటే.. అందరు అత్తలకీ ఆదర్శం అంట. ప్రతి కోడలూ నాకు కూడా ఇలాంటి అత్త ఉంటే ఎంత బావుండు అని ఫీలయ్యే వారట. మరి బయటి వారికే అంత నచ్చుతుందంటే.. సొంత కోడళ్లకి ఇంకెంత నచ్చుతుందో కదా.
అందుకే.. ఆమె చనిపోయిన తర్వాత.. 2010 లో.. హైవే పక్కన గుడి కట్టారు కోడళ్లు. గుళ్లో విగ్రహం పెట్టి.. ఆ విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అప్పుడప్పుడూ బంగారు ఆభరణాలని కూడా మారుస్తూ కొత్తవి తీసుకొస్తారట. అంతేనా.. కట్టి వదిలేయలేదు. ఎప్పుడూ నీట్‌గా మేన్ టేన్ చేస్తారట. ప్రతి రోజూ కేర్ తీసుకుంటారట.
అంతటితో ఆగలేదు. ప్రతి నెలా అందరు కోడళ్లూ కలిసి వచ్చి.. అత్త భజనలు చేస్తారట. అత్త మీద కీర్తనలు కూడా పాడతారట. అత్తంటే అలా ఉండాలి అనే వాళ్లు అంటుంటే.. కోడళ్లంటే కూడా ఇలా ఉండాలి అనే వాళ్లూ అంటుంటారట.
