1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Mukesh Ambani's Iron Man Praise For Amit Shah

అమిత్ భాయ్.. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా : ముకేశ్ అంబానీ ప్రశంసలు

Mukesh Ambani
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. అమిత్ షా.. "ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటూ కీర్తించారు. 
 
పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అమిత్‌షా, ముకేశ్‌ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్‌ మాట్లాడుతూ... 'అమిత్‌ భాయ్‌.. మీరు నిజమైన కర్మయోగి. మీరు అసలైన 'ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా'. అప్పుడు గుజరాత్‌, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోంది. దేశం ఇప్పుడు రక్షణ కవచాల్లో ఉంది' అని అన్నారు. 
 
ఆ తర్వాత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, 'మీ లక్ష్యం నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయకండి. పెద్ద లక్ష్యాలను ఏర్పరుచుకోండి. మీ కలలను సాకారం చేయడానికి ఇండియా సన్నద్ధమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కల సమర్థనీయమైనదే' అని అన్నారు.
 
తర్వాతి కథనం
ఒకటి కాదు.. నాలుగు లడ్డూలు కావాలా నాయనా?