1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. NASA Says Latest Moon Flyby Found No Trace of Chandrayaan-2 Lander Vikram

ఫోటోలు తీసిన నాసా ఆర్బిటర్.. అయినా విక్రమ్ జాడ కనిపించలేదు..

Chandrayaan-2
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలోని ల్యాండప్ విక్రమ్ పరిస్థితిపై ఇంకా స్పష్టత రావట్లేదు. చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా వున్న ల్యాండర్ విక్రమ్ ఫోటోలు తీసేందుకు నాసా మరోసారి ప్రయత్నం చేసింది. విక్రమ్ దిగినట్లు భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) అక్టోబర్ 14న ఫోటోలు తీసింది. 
 
కానీ ఈ చిత్రాల్లో విక్రమ్ ఆచూకీ మాత్రం లభించలేదని నాసా తేల్చేసింది. ఈ ఫొటోల్లోనూ విక్రమ్‌ కనిపించలేదని నాసా ప్రకటించడంతో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఖక్షాంశం తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఆ నీడలోనైనా ల్యాండర్‌ ఉండాలి. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల అయినా ఉండొచ్చునని ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు.
 
కాగా విక్రమ్ ఆచూకీ కోసం నాసా గతంలో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సెప్టెంబర్ 17న ఎల్ఆర్‌వో ఫోటోలు తీసింది. కానీ ఆ సమయంలో చీకటి ఎక్కువగా వుండటంతో విక్రమ్ గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బొర్రా గుహలకు టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు