చంద్రుడి ఉపరితల ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో

Moon
ఠాగూర్|
చంద్రుడి ఉపరితల ఫొటోలను ఇస్రో చేసింది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లో అమర్చిన ఆర్బిటర్‌ హై రెసొల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ).. చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసింది.

సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్‌ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది.

శనివారం తెల్లవారుజామున 4:38 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంలోని బోగస్లాస్కై బిలం పరిసరాలను వంద మీటర్ల దూరం నుంచి ఆర్బిటర్ ఫొటోలు తీసినట్టు ఇస్రో పేర్కొంది.

ఫొటోల్లో కనిపిస్తున్న బండరాళ్ల ఎత్తు రెండు మీటర్లు ఉండగా, బిలాలు ఐదు మీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వృత్తాకారంలో ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే సూర్య కిరణాలు ప్రసరిస్తున్నాయని, మరో వారం రోజుల్లో పూర్తిగా వెలుతురు వస్తుందని పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :