ఆర్డీఎక్స్ లవ్‌ నుంచి కొత్త ట్రైలర్.. అక్టోబర్ 11న విడుదల (వీడియో)

సెల్వి| Last Updated: గురువారం, 3 అక్టోబరు 2019 (13:02 IST)
ఆర్డీఎక్స్ లవ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో వెరైటీగా రొమాన్స్‌తో పాటు యాక్షన్ కూడా పండిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌తో సంబంధం లేకుండా టీజర్‌ను అదరగొట్టాడు దర్శకుడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు.

శంకర్ భాను దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఆర్డీఎక్స్ లవ్ నుంచి కొత్త ట్రైలర్ వచ్చింది. ఆర్డీఎక్స్ లవ్
సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
దీనిపై మరింత చదవండి :