శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (14:14 IST)

మెకాఫీ లిస్టు.. అగ్రస్థానంలో ధోనీ.. ఆ రెండు స్థానాల్లో సన్నీలియోన్, సచిన్ (video)

మెకాఫీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో భారత సెలెబ్రిటీలు చాలా డేంజరని తెలిసింది. అదెలాగంటే..? సన్నీ లియోన్, రాధికా ఆప్టే, క్రికెటర్లు సచిన్, ధోనీ, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుల గురించి నెట్టింట్లో చాలామంది వెతుకుతున్నారు.

అయితే వీరి గురించి సెర్చ్ చేసేటప్పుడు మాత్రం నకిలీ లింకులు తగులుతున్నాయట. వీరి కోసం సెర్చ్ చేస్తే చాలామటుకు అశ్లీల, డేంజరస్ వెబ్ సైట్లకు దారితీస్తున్నాయని మెకాఫీ సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
ముఖ్యంగా ధోని నెటింట్లో అత్యంత డేంజరస్ వ్యక్తిగా మారిపోయాడు. ఎం.ఎస్.ధోని అని మనం నెట్లో వెతికినపుడు అశ్లీల వెబ్‌సెట్స్ లింకులు రీ డైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ అనే సంస్థ తన సర్వేలో పేర్కొంది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో ఎవరెనున్నారో ఓ నివేదిక సిద్ధం చేసింది. 

 
ఇందులో సన్నిలియోన్,  రాధిక ఆప్టే, క్రికెటర్ సచిన్, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్లు ప్రధానంగా వున్నాయి. ఈ జాబితాలో ధోనీ, సచిన్ తొలి రెండు స్థానాల్లో వుండగా, బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మాత్రం నాలుగో స్థానంలో వుంది.