1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Police arrested two mens for selling dog meat briyani in ambur

ఆంబూరులో మటన్ బిర్యానీ కాదు.. డాగ్ బిర్యానీ.. పరుగులు తీసిన జనం..

Police
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రైల్వే అధికారులు. ఈ మాంసాన్ని ఎప్పుడైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో.. హోటళ్లలో వెళ్లి బిర్యానీ తినేవారికి భయం పట్టుకుంది. హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వాడుతున్నారని తేలడంతో.. జనం బిర్యానీ అంటేనే జడుసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో బిర్యానీకీ బాగా పాపులర్ అయిన తమిళనాడులోని ఆంబూరులో మటన్‌తో పాటు కుక్క మాంసాన్ని కలిపి బిర్యానీ వండటమే కాకుండా అమ్మాలని చూసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంబూరులోని ఓ షాపులో చౌక ధరకే బిర్యానీ అమ్ముతున్నట్లు తెలియడంతో ప్రజలు ఆసక్తిగా వెళ్లి, బిర్యానీ లాగించారు. 
 
అయినా బిర్యానీ తింటుండగా అది మటనా అనే డౌట్ జనాలకు రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు వద్దకు వెళ్లి విచారణ జరపడంతో.. అది మటన్ బిర్యానీ కాదని.. డాగ్ బిర్యానీ అని తేలింది. అంతే ఆ షాపుకు వచ్చిన జనం అబ్బే అంటూ చేతులు కూడా వాంతులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో షాపు నడిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తర్వాతి కథనం
మైనర్ మనవరాలికి ఇష్టం లేని పెళ్లి.. ఆపిన తాతయ్య.. రాయిని తలపై మోది..?