1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Taj Mahal must be protected or demolished: Supreme Court blasts government

తాజ్‌మహల్‌ను మీరు ధ్వంసం చేస్తారా? లేదా? : సుప్రీంకోర్టు

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌‌మహల్‌ సంరక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రపంచ వారసత్వ సంపదను సంరక్షించలేకుంటే ధ్వంసం చేయాలని లేదా తాజ్‌మహల్‌ను మూసివేసేలా ఉత్తర్వులు జారీచేస్తామని హెచ్చరి

Taj Mahal
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌‌మహల్‌ సంరక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రపంచ వారసత్వ సంపదను సంరక్షించలేకుంటే ధ్వంసం చేయాలని లేదా తాజ్‌మహల్‌ను మూసివేసేలా ఉత్తర్వులు జారీచేస్తామని హెచ్చరించింది. ఈ విషయంలో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నిసార్లు మొత్తుకున్నా తాజ్‌మహల్ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
 
నానాటికీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల పాలరాతితో నిర్మితమైన తాజ్‌మహాల్ రంగుమారిపోతోంది. ఈ అరుదైన కట్టడాన్ని సంరక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. తాజ్‌ను మూసివేయమంటారా? లేదా? మీరు ధ్వంసం చేస్తారా? లేదంటే ఆ కట్టడాన్ని సంరక్షించుకోవడానికి కావాల్సిన పునర్ నిర్మాణ పనులు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించింది. 
 
ఈఫిల్ టవర్ కన్నా తాజ్‌మహల్ అందమైనదని, ఓ రకంగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ సమస్యను తాజ్ తీర్చేదని న్యాయమూర్తులు తమ తీర్పులో వ్యాఖ్యానించారు. ప్రతి యేడాది ఈఫిల్ టవర్‌ను చూసేందుకు 80 లక్షల మంది వెళ్తుంటారని, అదో టీవీ టవర్‌గా కనిపిస్తుందని, కానీ మన తాజ్ మరింత అందమైందని, దాన్ని సరిగా చూసుకుంటే విదేశీ కరెన్సీ సమస్య ఉండేది కాదు అని జడ్జిలు అభిప్రాయపడ్డారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. తప్పుబట్టిన కత్తి మహేష్