మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (14:48 IST)

తాజ్‌మహల్‌ను షాజహాన్ ఆ బోర్డుకు రాసిచ్చారా? మినార్ కూలిపోయిందా?

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘలాయ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చాడని ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజ్ మహల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఆర్కియా

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘలాయ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చాడని  ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజ్ మహల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సున్నీ వక్ఫ్ బోర్డు చాలాకాలంగా పోరాడుతున్న నేపథ్యంలో 2010లో వక్ఫ్ బోర్డు వాదనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఏఎస్ఐ పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై జరిగిన తాజా విచారణలో.. ఆధారాలు సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. షాజహాన్ తాజ్ మహల్‌ను రాసిచ్చినట్టుగా చెబుతున్న డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకుగానూ వారం రోజుల గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్‌ను తమకు రాసిచ్చారన్న వాదన నమ్మశక్యంగాలేదని పేర్కొంది.
 
ఇదిలా ఉంటే.. ప్రఖ్యాత ఖట్టడం తాజ్‌మహల్‌‌కు ఆవరణలో ఉన్న మినార్ (గోపురం) కూలిపోయింది. ఉత్తరప్రదేశ్‌ను బుధవారం రాత్రి భారీ వర్షాలు ముంచెత్తడంతో.. భారీగా వీచిన గాలులకు తాజ్‌ ఆవరణలో ఉన్న మినార్ కూలి ధ్వంసమైందని అధికారులు తెలిపారు.