బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (12:27 IST)

దేవాన్ష్ కలిపిన ఉగాది పచ్చడినే తిన్నాను.. రెండుసార్లు?: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఉగాది రోజున నా మనవడు దేవాన్ష్ కలిపిన పచ్చడినే తిన్నానని చంద్రబాబు విజయవాడ ఉగాది వేడుకల్లో తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంల

ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఉగాది రోజున నా మనవడు దేవాన్ష్ కలిపిన పచ్చడినే తిన్నానని చంద్రబాబు విజయవాడ ఉగాది వేడుకల్లో తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్లోనే జీవితసారం వుందన్నారు. ఈ సందర్భంగా దేవాన్ష్ పచ్చడి కలిపాడని, అందులో వేపపువ్వు చేదు అతనికి నచ్చినట్లు లేదని.. రెండుసార్లు తిని, ఇక సరిపోయిందని చెప్పాడని బాబు అన్నారు. 
 
ఇక చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాలని సంకేతం ఇస్తుందని.. పచ్చిమామిడి రుచితో కొత్త సవాళ్లు ఎదురవుతాయని, కారంతో సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందని.. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఉగాది పచ్చడిలో ఎంతో నిగూఢార్థం వుందని చెప్పుకొచ్చారు. 
 
భారీ వర్షాలు కురిస్తే నీట మునిగే పల్లపు ప్రాంతాల భూములతో పాటు లంక భూములను రాజధాని నగర నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఆశించి సమీకరించిందో తెలియజేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నకు కూడా చంద్రబాబు పరోక్షంగా బదులిచ్చారు. ఏ నగరాన్ని ఆకాశంలో నిర్మించలేమన్నారు. అమరావతికి భవిష్యత్ ఇబ్బందులు రాకూడదనే భూముల సమీకరణ జరిగిందని, రైతులు భూములను వారంతట వారే ఇచ్చారని బాబు తెలియజేశారు.