1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (13:13 IST)

దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే : రాహుల్

యావత్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి.

యావత్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని అన్నారు. దేశంలో అనేక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు. యువతను నిరుద్యోగం వెంటాడుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించట్లేదన్నారు.
 
'ప్రస్తుతం దేశమంతా అసంతృప్తి, ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి మార్గదర్శకంగా ఉండాలి. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించడంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలి. ఈ దేశం ప్రజలందరిది. అన్ని మతాలు, వర్గాల వారిది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తోంది. వారు(భాజపా) కోపాన్ని ఉపయోగిస్తున్నారు. మేం ప్రేమతో పనిచేస్తున్నాం' అని రాహుల్ చెప్పుకొచ్చారు.