#BulletBandi పాటకు #NurseDance వీడియో వైరల్
Bullet song
ఫేస్ బుక్, వ్యాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే పాటతో మహిళలు తమదైన స్టైల్లో స్టెప్పులు వేస్తూ మురిసి పోతున్నారు. పాటలో మంచి మీనింగ్ ఉండటంతో చూసే వాళ్లు కూడా ఎంకరైజ్ చేస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు సాంగ్ పెళ్లి కూతురి డ్యాన్స్‌తో వైరల్ కాగా.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో నర్సు ఈ పాటతో డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిశాక.. తోటి నర్సులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా నర్సు డాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె డాన్స్ చేస్తుండగా మిగతా నర్సులు చప్పట్లతో ఎంకరైజ్ చేశారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింతో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ పాట కూడా మరింత వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ఈ సాంగ్ పై డాన్స్ చేస్తూ మరెంత మంది కళాకారులు వెలుగులోకి వస్తారోనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
