సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (18:26 IST)

ఇంటర్నెట్‌లో వైరల్.. మనవడితో బామ్మ నాగినీ డ్యాన్స్

Nagini Dance
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీడియో కాస్త ఫన్నీగా ఉంటే చాలు నెటిజన్లు దాన్ని వైరల్ చేస్తారు. తాజాగా ఓ బామ్మ తన మనవడితో కలిసి చేసిన నాగినీ డ్యాన్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. 
 
ఈ వీడియోలో మనవడు తన టైని ఫ్లూట్‌లా పట్టుకుని ఊదుతుంటే.. బామ్మ తన అరచేతిని నాగుపాము పడగలా పెట్టి స్టెప్పులు వేసింది. కంటెంట్ క్రియేటర్ అయిన అంకిత్ జాంగిద్ కొన్ని రోజుల క్రితం బామ్మ డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "నా సోల్‌మేట్‌ను మా దాదీలో కనుగొన్నాను" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. 
 
ఈ వీడియోకు ఇప్పటికే 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతేగాక ఈ వీడియో చూసిన నెటిజన్‌లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. హార్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. బామ్మ నీ డ్యాన్స్ చాలా బాగుంది, ప్రత్యేకంగాను ఉంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.