గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (11:29 IST)

మోడీ సామాజిక నిర్వేదం... సోషల్ మీడియాపై నిషేధానికేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంటే.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ఖాతాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వచ్చే ఆదివారం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 
 
నిజానికి ఫేస్‌బుక్ ద్వారా ఆయనను 4 కోట్ల 47 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విటర్‌లో 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. మిగతా అకౌంట్లను కలుపుకుంటే మోడీని సోషల్ మీడియా ద్వారా 15 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతల్లో మోదీ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయనకు 3 కోట్లమందికిపైగా ఫాలోవర్లు ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు 1.49 కోట్లు, ఒబామాకు 2.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక మాధ్యమాల నుంచి మోడీ ఎందుకు వైదొలుగుతున్నారో తెలియరాలేదు.
 
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఓ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సోష‌ల్ మీడియాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుందేమో అని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  దేశంలో సోష‌ల్ మీడియాను బ్యాన్ చేయాల‌న్న ఉద్దేశంతోనే.. ముంద‌స్తుగా మోడీ ఈ హెచ్చ‌రిక చేసి ఉంటార‌ని శ‌శి థ‌రూర్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. 
 
మంచిని వ్యాప్తి చేయ‌డానికి సోష‌ల్ మీడియా చాలా ఉప‌యుక్తంగా ప‌నిచేస్తుంద‌న్న విష‌యం ప్ర‌ధాని మోడీకి తెలుసు అని, సోష‌ల్ మీడియా ద్వారా పాజిటివ్ ఆలోచ‌న‌ల్ని పెంచ‌వ‌చ్చు అన్నారు. ఎంతో అవ‌స‌ర‌మైన మెసేజ్‌ల‌ను కూడా చేయ‌వ‌చ్చు అన్నారు. కేవ‌లం విద్వేష ప్ర‌సంగాల‌ను మాత్ర‌మే వ్యాప్తి చేయ‌డానికి సోష‌ల్ మీడియాను వాడకూడ‌దంటూ శ‌శిథ‌రూర్ త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు.