శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (16:06 IST)

పాకిస్థాన్‌పై మండిపడిన సోషల్ మీడియా.. ఎందుకని?

పాకిస్థాన్‌పై సోషల్ మీడియా ఫైర్ అయ్యింది. పాకిస్తాన్‌లో తమ సేవలను నిలిపివేస్తామని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ హెచ్చరించాయి. పాక్‌లోని ఇమ్రాన్ ప్రభుత్వం వీటిపై గతనెలలో కొత్తగా సెన్సార్‌షిప్ నిబంధనలు విధించడంతో సోషల్ మీడియాకు కోపం వచ్చింది. ప్రజలను రక్షించేందుకు.. సోషల్ మీడియా యాక్టివిటీని నియంత్రిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. 
 
అవసరమైనప్పుడు.. తమకు సంబంధిత సమాచారం ఎక్కడి నుంచి అందిందో, ఆ డేటాను తప్పనిసరిగా ఇవి ఓ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి షేర్ చేయాలని సర్కార్ సూచించింది. పాకిస్తాన్‌లో సోషల్ మీడియా పట్ల ఈ విధమైన నిబంధనలు విధిస్తే.. అంతర్జాతీయ కంపెనీలు తమ పనితీరుపై అనుమానాలు ప్రకటించవచ్చునని పేర్కొన్నాయి.
 
అయితే ఈ రూల్స్‌కి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, వీటి మార్పునకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయని పాక్ విద్యా శాఖ మంత్రి షఫ్ ఖాత్ మహమ్మద్ తెలిపారు.