అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. ప్రేమను పంచండి

shruti haasan
shruti haasan
సెల్వి| Last Updated: శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:07 IST)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం ఫ్యాన్స్‌కు షాకింగ్ ఇచ్చే విషయాన్ని చెప్పింది. తాను గతంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ఎవరో చెప్పినట్లు తాను జీవించనని పేర్కొంది. లావుగా వున్న తాను సన్నగా మారానని.. తన ఆకృతిపై పెద్ద రచ్చే జరిగిందని.. శ్రుతి హాసన్ తెలిపింది. ఇందులో భాగంగా రెండు ఫోటోలను పోస్టు చేసింది.

హార్మోన్ల సమస్య కారణంగా తరచూ శారీరకంగా, మానసికంగా తాను ఇబ్బంది పడుతున్నానని తెలిపింది. గత కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నా. అదేమీ అంత సులభం కాదు. శారీరకమార్పుల వెనుక కష్టం మామూలుగా ఉండదు. కానీ, నా జర్నీ గురించి చెప్పడం చాలా సులువు. ఒకరి స్థాయిని మరొకరు నిర్ణయించలేరు.

అంతేగాకుండా.. గతంలో ప్లాస్టిక్‌సర్జరీ చేయించుకున్నా. దీని గురించి ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నానా? లేదు. అలాంటివి తనకు ఇష్టం ఉండదు. తనకు ఎలా జీవించాలని వుందో అలాగే జీవిస్తా. మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉందంటే, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ప్రేమను పంచండి. నిత్యం తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :