1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. YS Sharmila son Raja Reddy's wedding: Did Chandrababu get an invitation?

వైఎస్ షర్మిల కుమారుడు పెళ్లి: చంద్రబాబుకి ఆహ్వానం వెళ్లిందా?

YS Sharmila son Raja Reddy
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి జనవరి 17న జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి చంద్రబాబును ఆహ్వానిస్తూ శుభలేక పంపినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం చర్చనీయాంశం అవుతోంది. అమెరికాలో చదువుకుంటున్న వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి గత కొన్నేళ్లుగా ప్రియా అట్లూరి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. 
 
కాగా వైఎస్ షర్మిల తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపించారన్నది ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. మొన్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు క్రిస్మస్ కానుకలు పంపించారు. దీనికి ప్రతిగా ఆమెకు ధన్యవాదాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ఊహించని పరిణామాతో వైకాపా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
"వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతుంది... ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి" అంటూ లోకేశ్‌కు షర్మిల పంపిన సందేశంలో పేర్కొన్నారు. షర్మిల క్రిస్మస్ కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాదు.. ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు.
 
ప్రియమైన షర్మిల గారూ... మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ క్రిస్మస్‌తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకంక్షాలు తెలుపుతుంది" అని పేర్కొన్నారు. 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
తనను మేడం అని పిలవద్దు ప్లీజ్... సీతక్క అని పిలిస్తే చాలు : మంత్రి సీతక్క