ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (10:41 IST)

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!

sharmila ys
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా (ఏపీ పీసీసీ చీఫ్)గా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నియమితులుకానున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఆమె శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని చెబుతున్నారు. 
 
ఓ వైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న సమయంలోనే... రేపు ఆమె దేశ రాజధానిలో అడుగు పెట్టనున్నారని డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో ఇదే రోజు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్ఠానం ఆసక్తిగా ఉందని అంటున్నారు. 
 
అధిష్ఠానం పూర్తిగా చర్చించిన తర్వాత... పిలుపు రాగానే ఆమె రేపు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. షర్మిలను జాతీయస్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు, షర్మిల భర్త అనిల్ కుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది.