సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2023 (21:10 IST)

కాలుష్యంతో ఢిల్లీ రాజధాని నగరం ఉక్కిరిబిక్కిరి, 4 చక్రాల వాహనాలు నిషేధం

Delhi air pollution
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా రాజధాని ఢిల్లీలో BS-III పెట్రోల్, BS-IV డీజిల్‌తో నడిచే ఫోర్-వీలర్లను నిషేధించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయుకాలుష్యం అంతులేని సమస్యగా కొనసాగుతోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోంది. ఇది అక్కడ నివశిస్తున్న మానవకోటికి ప్రాణంతకంగా మారుతోంది.
 
వాహనాలు వెదజల్లుతున్న విషపూరిత పొగలు, ఢిల్లీ చుట్టూ జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల వాయుకాలుష్యం పెరిగిపోతోందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో, రైతులు పంట వ్యర్థాలను కాల్చడం కొనసాగిస్తున్నారు. ఇది కూడా వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని చెప్పారు.
 
ఈ పరిస్థితిలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 409కి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అనవసర నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అలాగే BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్లు అక్కడ నడపడం నిషేధించబడింది.
 
జాతీయ రక్షణ లేదా భద్రత, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు, ఆరోగ్యం, రైల్వేలు, మెట్రో రైలు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, విద్యుత్ సరఫరా, పైపులైన్లు, పారిశుద్ధ్యం మరియు నీటి సరఫరాకు సంబంధించిన నిర్మాణ పనులు నిషేధం నుండి మినహాయించబడ్డాయి.