గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:54 IST)

పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Parota
రాత్రిపూట పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన కోవైలో చోటుచేసుకుంది. తమిళనాడు, కోయంబత్తూరులో పరోటా తిని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 
 
తిరుప్పూరుకు చెందిన హేమచంద్రన్ అనే కాలేజీ విద్యార్థి కోవైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వచ్చాడు. ఇతడు కన్నన్‌పాళయంలోని ఓ హోటల్‌లో స్నేహితులతో కలిసి రాత్రి పూట పరోటా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
తెల్లారినా హేమచంద్రన్ నిద్రలేవలేకపోవడంతో స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించారు. కానీ హేమచంద్రన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై హేమచంద్రన్ స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.