1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
  4. Can a drumstick tree be grown at home for Drumsticks?

మునగ కాయల కోసం ఇంట్లో మునగచెట్టు పెంచవచ్చా?

drumstick
వాస్తు ప్రకారం కొన్ని చెట్లను ఇంటి ఆవరణలో పెంచరాదు. మరికొన్ని చెట్లను దిక్కులను అనుసరించి పెంచాలి. ఏ చెట్లను ఏ దిక్కులను అనుసరించి పెంచాలి... ఏ చెట్లను ఇంటికి ఆవరణలో పెంచవచ్చు, వేటిని పెంచకూడదో తెలుసుకుందాం.

 
పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో వేరే కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి. దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించేవారికి మేలు జరుగుతుంది.

 
కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు. నైరుతి దిశలో రేగుచెట్టు, దానిమ్మ, సీతాఫలం వుండకూడదు. వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు వుండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి వుండకూడదు. పడమర పనస, దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను  ఇంటి ప్రహరీగోడ లోపల పెంచకూడదు.
 
ఏ రకమైన క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ, తాటి, యూకలిప్టస్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచగూడదు. ఇంటి కాంపౌండ్ వాల్‌కి సుమారు ఆరడుగుల దూరంలో వీటిని పెంచుకోవచ్చు. బిల్వ పత్రం చెట్టును పెంచేవారు దాని మొదట్లో చిన్న శివలింగాన్ని వుంచితే ఆ ఇంటికేవన్నా తెలీని వాస్తు దోషాలుంటే అవి మటు మాయమవుతాయ. పొలాల్లో ఎటువంటి మొక్కలను పెంచాలనుకున్నా పొలంగట్టుకి తగలకుండా పెంచాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
గరుడ దర్శనంతో శుభ ఫలితాలేంటి? కలలో పాములు కనిపిస్తే?