మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (19:19 IST)

వాస్తు టిప్స్: ఇంట్లో గొడవలు.. అప్పులు వుంటే?

అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు  తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి. 
 
అలాగే దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.
 
అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా ఏడు రంగులు కలిసిన వాల్ మ్యాట్ గోడకు డెకరేషన్‌గా పెట్టాలి. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. 
 
అలాగే పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు. 
 
షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు.