బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (20:23 IST)

ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలిపి... (video)

ఉసిరికాయ చూర్ణంలో నువ్వుల చూర్ణం, నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. కంటిచూపును మెరుగుపరచుటకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.