సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:30 IST)

మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్‌ కన్నుమూత

Kamla Bhasin
ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్‌ (75) శనివారం కన్నుమూశారు. ప్రముఖ స్త్రీవాది, రచయిత కూడా. భారత్‌, దక్షిణాసియా దేశాల్లో మూడు దశాబ్దాలుగా లింగ వివక్ష, అభివృద్ధి, శాంతి, మానవ హక్కులు వంటి సమస్యలపై పోరాడారు. దక్షిణాసియాలో ' వన్‌ బిలియన్‌ రైజింగ్‌' ప్రచారంతో పాటు పలు ముఖ్యమైన ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. 
 
తనను తాను శిక్షణ సామాజిక శాస్త్రవేత్తగా అభివర్ణించుకున్న ఆమె.. 1970లో పలు సమస్యలపై ఉద్యమిస్తున్న నాటి నుండి స్త్రీవాదం, మహిళల సమస్యలపై పలు పుస్తకాలు రాశారు. ఆమె మృతిపై సోషల్‌ మీడియాలో పలువురు సంతాపం తెలిపారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు సంతాపం తెలిపారు.