సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:00 IST)

భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం: జో బైడెన్

అమెరికా పర్యటనలో వున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం ఆదేశ అధ్యక్షులు జో-బైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్‌ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. 
 
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు.
 
ఇక ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని చెప్పారు. వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు. 
 
ఆ తర్వాత వైట్‌హౌస్‌లో క్వాడ్‌ దేశాల సదస్సు జరిగింది. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు పాల్గొన్నాయ్‌. కరోనా, వాతావరణం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భద్రతపై కీలకంగా చర్చ జరిగింది. గతంలో సునామీపై కలిసికట్టుగా పనిచేసి, ప్రపంచానికి మద్ధతుగా నిలిచామన్నారు.