1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:32 IST)

దేశంలో కొత్తగా మరో 29 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 29 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. 
 
ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇకపోతే, కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో నిన్న 127 మంది మరణించారని వెల్లడించింది. మరో 127 మంది మరణించారని ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.