మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:39 IST)

భారత్‌లో దాడులకు ఉగ్రవాదుల కుట్ర: దసరా, దీపావళి పండుగలే టార్గెట్

భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఐఈడీ బాంబులతో బీభత్సం చేయాలని భావిస్తున్నాయని ఐబీ అంచనా వేసింది. 
 
జన సంచారం ఎక్కువగా ఉన్న చోట బాంబు పేల్చాలని అనుకుంటున్నాయని తెలిపింది. త్వరలో దసరా, దీపావళి పండగ వస్తోన్న సంగతి తెలిసిందే. అందుకోసం జనం షాపింగ్ కోసం.. ఇతర పనుల మీద వెళతారు. ఇదీ వారి టార్గెట్ అని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.
 
పండగ సమయంలోనే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని వివరించాయి.  జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. 
 
దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేయడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక, జమ్మూకాశ్మీర్‌లో గురువారం పాక్‌నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.