1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (09:34 IST)

ఢీకొన్న ట్రావెల్స్ బస్సు - టిప్పర్ లారీ - 15 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి లక్కారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ట్రావెల్స్‌ బస్సు, టిప్పర్‌ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. 
 
మరోవైపు ఘటనాస్థలంలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. 
 
రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రెండు ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.